కారులో 7 నెలల బాలుడ్ని వదిలి వెళ్ళిన తల్లిదండ్రులు

- September 19, 2017 , by Maagulf
కారులో 7 నెలల బాలుడ్ని వదిలి వెళ్ళిన తల్లిదండ్రులు

రస్‌ అల్‌ ఖైమా సివిల్‌ డిఫెన్స్‌ టీమ్స్‌, ఏడు నెలల బాలుడ్ని చాకచక్యంగా రక్షించగలిగారు. ఆ బాలుడ్ని అతని తల్లిదండ్రులు కారులో లాక్‌ చేసి షాపింగ్‌కి వెళ్ళారు. కారులో చిన్నారిని గుర్తించిన ఓ వ్యక్తి, పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు రంగంలోకి దిగి, బాలుడ్ని రక్షించారు. ప్రస్తుతం ఆ బాలుడు ఆరోగ్యంగానే ఉన్నాడని పోలీసులు తెలిపారు. బాలుడ్ని అలా నిర్లక్ష్యంగా కారులో వదిలి వెళ్ళిన తల్లిదండ్రులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని కారులో వదిలి వెళ్ళరాదని, వారి పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని డాక్టర్‌ రౌహా అబ్దుల్‌ అలీమ్‌ చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com