సల్మాన్ టౌన్‌లో మరిన్ని హోమ్స్ నిర్మాణం..!!
- June 05, 2026
మనామా: సల్మాన్ టౌన్‌లో మరిన్ని హోమ్స్ అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 69 కొత్త గృహ యూనిట్లను నిర్మించడానికి పునాది పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమానికి హౌజింగ్, అర్బన్ ప్లానింగ్ మినిస్టర్ ఆమ్నా అల్ రొమైహి మరియు డెల్మాన్ గేట్ కంపెనీ సీఈఓ అబ్దుల్లా అలీ హాజరయ్యారు.
ఈ ప్రాజెక్ట్ మొత్తం 13,891 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇందులోని గృహ యూనిట్లు ఒక్కొక్కటి 174 చదరపు మీటర్ల నుండి 261 చదరపు మీటర్ల పరిమాణంలో ఉంటాయి. గృహ నిర్మాణ రంగంలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యానికి ఈ ప్రాజెక్ట్ ఒక ఆధునిక మోడల్ ను అందిస్తుందని అల్ రొమైహి అన్నారు.
అల్ లావ్జీలోని సుహైల్ ప్రాజెక్ట్, సల్మాన్ టౌన్‌లోని అల్ నసీమ్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్, బుహైర్‌లోని అల్ వాడి ప్రాజెక్ట్, మరియు దానత్ హూరత్ సనద్ ప్రాజెక్ట్ వంటి ప్రాజెక్టుల ద్వారా సాధించిన ఫలితాలను ఈ సందర్భంగా మినిస్టర్ వివరించారు. ఈ ప్రాజెక్టులకు పౌరుల నుండి బలమైన డిమాండ్ ఉందన్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







