రజనీకాంత్‌కు డత్తో అవార్డు
- October 30, 2015
సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు మలేషియా ప్రభుత్వం గౌరవ పురష్కారాన్ని అందించనుందనేది తాజా సమాచారం. రజనీకాంత్ కబాలీ చిత్ర షూటింగ్ కోసం ఇటీవలే మలేషయా వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన్ని మలేషియా గవర్నర్ మోహమ్మద్ గహాలిల్ యాకోబ్ సాదరంగా ఆహ్వానించారు. కాగా తాజా సమాచారం ఏమిటంటే మలేషియా ప్రభుత్వం రజనీకాంత్‌కు గౌరవ పరస్కారాన్ని అందించనుందని తెలిసింది. రజనీకాంత్ మలేషియాలో జరుగుతున్న కబాలీ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్ర షూటింగ్ అక్కడే నెల రోజుల పాటు జరగనుంది. కాగా మలేషియా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బావించే డత్తో అవార్డును మన సూపర్‌స్టార్‌కు అందించాలని నిర్ణయించిన్నట్లు సమాచారం. ఈ దేశ గవర్నర్ రజనీకాంత్‌కు డత్తో అవార్డును ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు, అందుకు మలేషియా ప్రభుత్వం సమ్మతించినట్లు తెలిసింది. త్వరలోనే రజనీకాంత్‌కు డత్తో అవార్డు కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించడానికి సన్నాహాలు చేయనున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ బిరుదును ఇంతకు ముందు బాలీవుడ్ బాద్‌షా షారూఖ్‌ఖాన్ అందుకున్నారు. ఇటీవలే హాలీవుడ్ సూపర్‌స్టార్ జాకీచాన్ ఈ పురస్కారాన్ని అందుకున్నారన్నది గమనార్హం. త్వరలో ఈ కోవలోకి మన సూపర్‌స్టార్ చేరనున్నారన్న మాట.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







