అబుదాబీ: క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై అదనపు రుసుముల్లేవ్
- September 21, 2017ఎకనమిక్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ - అబుదాబీ, అన్ని కమర్షియల్ ఫెసిలిటీస్‌కి క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై ఎలాంటి అదనపు రుసుములు వసూలు చేయరాదని ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ ఆదేశాల్ని పట్టించుకోని పక్షంలో, బాధ్యులకు 8,000 దిర్హామ్‌ల వరకు జీరామాన విధించబడ్తుందని హెచ్చరించారు. అబుదాబీ ఎకనమిక్ డెవపల్‌మెంట్ డిపార్ట్మెంట్ - హయ్యర్ కమిటీ ఫర్ కన్స్యుమర్ ప్రొటెఎక్షన్ ఈ మేరకు స్పష్టతనిచ్చింది. క్రెడిట్ కార్డు ద్వారా లావాదేవీలు జరిపినప్పుడు అదనంగా కొంత రుసుముల్ని వసూలు చేయడంపై కొరడా ఝుళిపించినట్లు అధికారులు పేర్కొన్నారు. మొదటి దఫా ఈ తరహా నేరాలకు పాల్పడితే వార్నింగ్, రెండోసారి 4,000 దిర్హామ్‌ల జరీమానా, మూడోసారి 6,000 దిర్హామ్‌ల జరీమానా, నాలుగోసారి నేరం రిపీట్ అయితే 8000 దిర్హామ్‌ల జరీమానా తప్పదు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ