బహ్రైన్, భారత సంబంధాల గురించి చర్చ

- October 31, 2015 , by Maagulf
బహ్రైన్, భారత సంబంధాల గురించి చర్చ

మనామా డైలాగ్ యొక్క 11వ అంశంలో పాల్గొనడానికి విచ్చేసిన భారత నావికాదళం యొక్క డేప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ పరశురామ నాయుడు మురుగేశన్ మరియు వారి ప్రతినిధి బృందాన్ని,   బి. డి. ఎఫ్. కమాండర్ ఇన్ చీఫ్- ఫీల్డ్ మార్షల్ షేక్ ఖలీఫా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా, రిట్జ్ కర్ల్‌టన్ హోటల్ లో స్వాగతం పలికారు.

వారు దృఢమైన ద్వైపాక్షిక సంబంధాలు, వివిధ రంగాలలో అభివృద్ధి మరియు ఇతర ఉమ్మడి అంశాలను గురించి చర్చలు జరిపారు. ఈ కార్యక్రమంలో బి. డి. ఎఫ్.  చీఫ్ ఆఫ్ స్టాఫ్ - లెఫ్ట నెంట్ జనరల్ ధీయాబ్ బిన్ శాక్ర్ అల్ నువైమీ, జనరల్ కమాండ్ కోర్ట్ అక్టింగ్ డైరక్టర్ - మేజర్ జనరల్ హసన్ మహమ్మద్ సాద్, ఇన్‌స్పెక్టర్ జనరల్ - మేజర్ జనరల్ అబ్దుల్లా హస్సన్ అల్ నువైమీ, అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫర్ సప్లై అండ్ లాగిస్టీక్స్ - రియర్ అడ్మిరల్ యూసుఫ్ అహ్మద్ మాల్- అల్లా మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com