టాప్ రేటింగ్ అందుకున్న 'కేశవ'

- September 23, 2017 , by Maagulf
టాప్ రేటింగ్ అందుకున్న 'కేశవ'

డిఫరెంట్ స్టోరీస్‌ని సెలక్ట్ చేసుకుని సినిమాలు చేస్తూ..వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నారు యంగ్ హీరో నిఖిల్.  విభిన్న కథలను సెలక్ట్ చేసుకోవడంతో పాటు తన లుక్‌ని కూడా సినిమా సినిమాకి మార్చుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. దీంతో ఈ కుర్ర హీరోకి వరుస హిట్స్ వస్తున్నాయి.

నిఖిల్ రీసెంట్ మూవీ కేశవ, వెండితెర మీద యావరేజ్ ఫలితాన్ని అందుకుంది. కానీ బుల్లితెర ప్రేక్షకులను మాత్రం బాగా మెప్పించింది. జెమినీ టీవిలో ఈ నెల 10న సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ అయిన కేశవ మూవీ, సినిమాల పరంగా టాప్ రేటింగ్ తెచ్చుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ బుల్లితెరపై టెలికాస్ట్ అవ్వడం ఇదే ఫస్ట్. కేశవ చిత్రానికి, 8.65 రేటింగ్ వచ్చింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com