2022 కల్లా అందరికీ ఇళ్లు.!
- September 23, 2017
మోడీ మిషన్ 2022 మొదలుపెట్టారు. యూపీలో పలు అభివృద్ధి పథకాలు ప్రారంభించిన ఆయన.. రెండు వేల ఇరవై రెండు నాటికి.. దేశాన్ని మార్చేయడానికి అందరూ కలిసి రావాలని కోరారు. అప్పటికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతుంది కాబట్టి.. ప్రతీ ఒక్కరూ ఒక్కో సంకల్పాన్ని తీసుకోవాలన్నారు. దీనివల్ల ఐదేళ్లలోనే దేశం 125 కోట్ల అడుగులు ముందుకు వెళుతుందన్నారు. అప్పటికల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేయడంతో పాటు.. అందరికీ ఇళ్లు కల్పించడమే తాను సంకల్పంగా తీసుకున్నానన్నారు ప్రధాని.
ఉత్తర ప్రదేశ్‌లోని సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటిస్తున్న ప్రధాని.. షెహన్‌షా పూర్‌లో మరుగుదొడ్జి సెప్టిక్ ట్యాంక్ నిర్మాణానికి ఇటుకలు పేర్చారు. అనంతరం.. గోశాలను, పశు ఆరోగ్య మేళాను ప్రారంభించారు. తమకు పార్టీ కన్నా దేశమే ముఖ్యమన్న ప్రధాని.. ఇతర పార్టీల్లా ఓటు బ్యాంకు రాజకీయాలను చేయమన్నారు. అందుకే.. ఓటు హక్కులేని పశువుల కోసం ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







