భయభ్రాంతులకు గురిచేస్తున్న సన్నీ లియోన్
- September 23, 2017

ఒకప్పుడు పోర్న్ ఇండస్ట్రీలో రారాణిగా వెలుగొందిన సన్నీ లియోన్ తర్వాత ఆ బూతు ఇండస్ట్రీని వదిలేసి ఇండియన్ సినిమా రంగంలోకి ఎంటరైంది. క్రమక్రమంగా సన్నీకి ఇక్కడ ఆదరణ పెరగడం, అవకాశాలు బావుండటంతో వరుస సినిమాలు చేస్తూ ఇక్కడే సెటిలైంది. ఇండస్ట్రీకి వచ్చిన ఐదేళ్లలో పాతికకు పైగా సినిమాల్లో నటించింది అంటే సన్నీకి ఉన్న డిమాండ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
గతంలో 'రాగిణి ఎంఎంఎస్ 2' అనే హారర్ మూవీ చేసిన సన్నీ లియన్.... ప్రస్తుతం బాలీవుడ్లో మరో హారర్ మూవీ చేస్తోంది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు, ఓ వీడియో ఆమె అభిమానులతో షేర్ చేసుకున్నారు. వీడియో చాలా భయానకంగా ఉంది.
1) వైరల్ వీడియో
ఈ వీడియో ఇపుడు ఇంటర్నెట్ కొన్ని గంటల్లోనే వైరల్ అయింది. తన ముఖంపై చర్మాన్ని తొలగిస్తూ రక్తమోడుతున్నట్లు ఉన్న ఈ వీడియోలో కనిపిస్తున్నదంతా నిజం కాదు. షూటింగ్ కోసం ఇలాంటి కృత్రిమ చర్మాన్ని అతికించుకుంటారు.
2) ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్
నేను ఇప్పటి వరకు చేయని ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టు చేస్తున్నానని, చాలా ఎగ్జైటింగా ఉందని సన్నీ లియోన్ తెలిపారు. తన కెరీర్లో ఇది గుర్తుండి పోయే సినిమా అవుతుందని ఆమె తెలిపారు.
3) ఏ సినిమా?
అయితే ఈ సినిమా వివరాలను మాత్రం సన్నీ లియోన్ వెల్లడించలేదు. త్వరలో ఇందుకు సంబంధించిన సమాచారం తెలిసే అవకాశం ఉంది.
4) సన్నీ లియోన్
సన్నీ లియోన్ స్పెషల్ సాంగ్ చేసిన 'భూమి' చిత్రం ఈ వారం విడుదలైంది. ఆమె చేసిన సాంగుకు మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం 'తేరా ఇంతజార్' అనే బాలీవుడ్ సినిమాతో పాటు తెలుగు మూవీ పివిఎస్ గరుడ, ఓ బెంగాళీ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేస్తోంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







