తమంతట తామే సర్జరీలు చేస్తామంటున్న రోబోలు
- September 23, 2017
ఇంతవరకూ ఆపరేషన్లలో డాక్టర్లకు సహాయం చేసిన మరమనుషులు.. ఇప్పుడు తమంతట తామే సర్జరీలు చేస్తామంటున్నాయి. చైనాలోని ఓ రోబో.. డెంటిస్ట్ అవతారం ఎత్తింది. ఓ పేషెంట్‌కు.. రెండు పళ్లను ఫిక్స్ చేసింది. డెంటిస్ట్ రోబోను చైనా పరిశోధకులు అభివృద్ధి చేశారు. మనుషుల సహాయం లేకుండానే ఇది చికిత్స చేయగలదు. మనుషుల వల్ల జరిగే పొరపాట్లేవీ దీనివల్ల జరగవంటున్నారు. చైనాలో ప్రస్తుతం డెంటిస్ట్ల కొరత చాలా ఎక్కువగా ఉందట. ఈ రోబో వల్ల ఆ సమస్య పరిష్కారమవుతుందంటున్నారు.
డెంటింస్ట్ రోబో చేస్తున్న ఫస్ట్ ట్రీట్మెంట్ కావడంతో.. డాక్టర్లు కూడా దానిపక్కనే ఉండి ఎలా చేస్తుందో పరీక్షించారు. అయితే.. దానికి ఎలాంటి సాయం మాత్రం చేయలేదు. అన్ని పనులూ అదే చేసుకుంది. దాదాపు గంటసేపు ట్రీట్మెంట్ చేసిన రోబో.. ఓ మహిళకు జాగ్రత్తగా రెండు కొత్త పళ్లను అమర్చింది. ఈ పళ్లను కూడా త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో తయారు చేశారట. ఫస్ట్ ట్రీట్మెంట్ సక్సెస్ కావడంతో.. ఇలాంటి మరిన్ని రోబోలను తయారు చేసేందుకు సిద్ధమవుతున్నారు చైనా పరిశోధకులు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







