ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్‌లలో '2.0'

- September 23, 2017 , by Maagulf
ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్‌లలో '2.0'

''రోబోకి సీక్వెల్‌గా వస్తున్న 2.0 వంటి హై టెక్నికల్‌ వాల్యూ ఉన్న సినిమాను త్రీడీలో చూస్తే ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. అది కష్టమే అయినా.. కొత్త అనుభూతిని పంచాలనే తపనతో '2డీ'లోనే కాకుండా త్రీడీలో కూడా తెరకెక్కిస్తున్నాం'' అని లైకా ప్రొడక్షన్‌ సంస్థ సీఓఓ రాజు మహాలింగం అన్నారు. రజనీకాంత్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం '2.0'. అమీజాక్సన్‌ కథానాయిక. అక్షయ్‌కుమార్‌ ప్రతినాయకుడిగా కనిపిస్తారు. జనవరిలో ప్రేక్షకుల ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా త్రీడీ టెక్నాలజీలో రిలీజ్‌ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన డిజిటల్‌ మీట్‌ శనివారం హైదరాబాద్‌లో జరిగింది.

రాజు మహాలింగం మాట్లాడుతూ ''భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న '2.0'ను ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్‌లలో విడుదల చెయ్యలనుకుంటున్నాం. అన్ని చోట్ల త్రీడీలో చూపించడానికే ప్రయత్నాలు చేస్తున్నాం. చైనాలో 15 వేలకుపైగా థియేటర్‌లలో విడుదల చెయ్యనున్నాం'' అని తెలిపారు. డి.సురేశ్‌బాబు మాట్లాడుతూ ''ఇవాళ్ల ప్రేక్షకులు థియేటర్‌కు రావాలంటే మంచి సినిమా, మోడ్రన్‌ టెక్నాలజీతో సౌకర్యాలు ఉండాలి.

'రోబో' లాంటి సినిమాను చూడాలంటే టెక్నికల్‌గా థియేటర్‌ హై ఎండ్‌లో ఉండాలి. అప్పుడే కొత్త అనుభూతి కలుగుతుంది'' అని చెప్పారు. 2డీ థియేటర్‌ను త్రీడీకి మార్చుకునే విధానం గురించి, దానికి కావలసిన ఎక్వి్‌పమెంట్‌ గురించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రీతమ్‌ డేనియల్‌, సార్జా వివరించారు. శరత్‌ మరార్‌, సందీ్‌పరెడ్డి వంగా తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com