బిగ్ బాస్ హౌజ్ లో ఎన్టీఆర్ తో దేవి శ్రీ సందడి
- September 24, 2017
బిగ్ బాస్ షో ఈ రోజు తో మొదటి సీజన్ ని కంప్లీట్ చేసుకోనున్నది. ఎన్టీఆర్ హోస్ట్ గా బుల్లి తెరపై అడుగు పెట్టి అలరించిన ఈ షో లో విజేత ఎవరో ఈ రోజు తేలిపోనున్నది.. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ షో మంచి విజయం సాధించింది. చివరి రోజును బిగ్ బాస్ హౌజ్ మరింత జనరంజకంగా... ఆసక్తికరంగా తీర్చిదిద్దేందుకు నిర్వాహకులు సన్నాహాలు పూర్తి చేశారు. బిగ్ బాస్ గ్రాండ్ ఫీనాలే డే ని నాలుగు గంటల పాటు సాగుతుంది అట. ఎన్టీఆర్ హంగామా తో పాటు.. బిగ్ బాస్ హౌజ్ సీజన్ 1 విజేత టైటిల్ కోసం పోటీలో ఉన్న హరితేజ, అర్చన, ఆదర్శ్, నవదీప్, శివబాలాజీ లు ఈ రోజు రకరకాల కార్యక్రమాలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేటెడ్ అయిన ఇతర పార్టిసిపెంట్లను కూడా రప్పించి ఈ షో లో సందడిలో పాలుపంచుకొనే అవకాశం కల్పించనున్నారు.. అంతేకాదు.. బిగ్ బాస్ ఫైనల్లో ఒక బిగ్ సర్ప్రైజ్ ఉండనున్నది టాక్ వినిపిస్తోంది.
మల్టీ టాలెంటెడ్ పర్సన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఈ షో లో లైవ్ ఈవెంట్ ను చేయబోతున్నాడట. లైవ్ షో లో దేవి చేసే హంగామా గురించి తెలిసిందే.. మరి ఆ సందడికి ఎన్టీఆర్ తోడు అయితే.. ఎనర్జీ పీక్ లో ఉంటుంది. దీంతో బిగ్ బాస్ షో కి దేవి శ్రీ ప్రదర్శన ఓ ప్రత్యేక ఆకర్షణ అవుతుంది. ఇన్ని రోజుల వరకూ బిగ్ బాస్ షో ఒక ఎత్తైతే.. బిగ్ బాస్ ఫైనల్లో బిగ్ సర్ఫ్రైజ్ ఒక ఎత్తు అని టాక్..
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







