కేరళ లో షూటింగ్ జరుపుకుంటున్న 'రాజా ది గ్రేట్'
- September 24, 2017
రాజా ప్రపంచాన్ని చూడలేడు. అయితేనేం, ప్రపంచం మొత్తం తనవైపు తిరిగి చూసేలా చేశాడు. మరి రాజా చేసిన ఆ గొప్ప పనేంటో తెలియాలంటే 'రాజా ది గ్రేట్' సినిమా చూడాల్సిందే. రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. మెహరీన్ కథానాయిక. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. శిరీష్ నిర్మాత. దిల్రాజు సమర్పిస్తున్నారు. చిత్రీ కరణ తుదిదశకు చేరుకొంది. ప్రస్తుతం కేరళలో నాయకా నాయికలపై ఓ పాటని చిత్రీకరిస్తున్నారు. దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో రవితేజ అంధుడిగా నటించారు. ఆయన పాత్ర, నటన కొత్త తరహాలో ఉండబోతోందని, ఇంటిల్లిపాదినీ అలరించే వినోదంతో చిత్రం తెరకెక్కుతోందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







