పోలీసు జీవితం ఆధారంగా వస్తున్న 'ఖాకీ'
- September 24, 2017
కార్తి కథానాయకుడిగా తమిళంలో తెరకెక్కుతున్న 'ధీరన్ అదిగారమ్ ఒండ్రు' తెలుగులో 'ఖాకీ' పేరుతో విడుదలవుతోంది. 'ద పవర్ ఆఫ్ పోలీస్...' అనేది ఉపశీర్షిక. హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కార్తీ సరసన రకుల్‌ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. టీజర్‌ని ఈ నెల 27న, ట్రైలర్‌ని వచ్చే నెల 17న ఆవిష్కరిస్తారు. నవంబరు 17న చిత్రాన్ని విడుదల చేస్తారు. ''దర్శకుడు వినోద్ తయారు చేసిన 'ఖాకీ' కథ వినగానే ఎలాగైనా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకి అందించాలని హక్కుల్ని సొంతం చేసుకొన్నాం. 2005లో ఓ పత్రికలో ప్రచురితమైన ఓ సంఘటన ఆధారంగా ఈ కథని తీర్చిదిద్దాడు. వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందించిన ఈ సినిమాలో కార్తీ శక్తివంతమైన పోలీసు అధికారిగా కనిపిస్తారు. ఒక పోలీసు జీవితంలో చోటు చేసుకొన్న సంఘటనలు, ఆయన ఎదుర్కొన్న సవాళ్లు ఎలాంటివన్నది తెరపైనే చూడాలి. జిబ్రాన్ సంగీతం బాగుంటుంద'' అన్నారు నిర్మాతలు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







