పాదచారులకు దారివ్వండి: మోటరిస్టులకు పోలీసుల సూచన

- September 24, 2017 , by Maagulf
పాదచారులకు దారివ్వండి: మోటరిస్టులకు పోలీసుల సూచన

షార్జా: మోటరిస్టులు, పాదచారులకు దారివ్వాలనీ, నిర్దేశిత ప్రాంతాల్లో పాదచారులు రోడ్డును దాటేందుకు మోటరిస్టులు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. పాదచారులు రహదారిని దాటే ప్రాంతాల్లో మోటరిస్టులు అతివేగంగా నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పోలీసులు చెప్పారు. అంతర్గత రోడ్లపై వాహనదారులు ఖచ్చితంగా వేగం తగ్గించి తమ వాహనాలు నడపాల్సి ఉంటుందని పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు సూచించారు. పాదచారులకు అవకాశమివ్వకుండా వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలుంటాయనీ, నిబంధనల ప్రకారం 500 దిర్హామ్‌ల జరీమానా, ఆరు బ్లాక్‌ పాయింట్స్‌ ఉల్లంఘనులకు తప్పవని పోలీస్‌ ఉన్నతాధికారులు హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com