దుబాయ్‌లో స్మార్ట్ రాడార్స్ ఎలా పనిచేస్తాయంటే!
- September 24, 2017
దుబాయ్: ప్రస్తుతం ఉన్న రాడార్లతో పోల్చితే, కొత్తగా రూపొందించిన 'స్మార్ట్ కంట్రోలర్' రాడార్లు అత్యంత ఖచ్చితత్వంతో రోడ్లపై నిబంధనల ఉల్లంఘనల్ని గుర్తించనున్నాయి. దుబాయ్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి మాట్లాడుతూ, ఇంటిగ్రేటెడ్ టెక్నికల్ సిస్టమ్ ఇందులో ప్రత్యేకమైనదనీ, రోడ్ సేఫ్టీ, ఎలక్ట్రానిక్ కంట్రోల్ వంటి అంశాల్లో కొత్త రాడార్లు మెరుగైన ప్రదర్శన ఇస్తాయని చెప్పారు. రోడ్లపై ప్రమాదాల్ని నివారించేందుకు, ఉల్లంఘనల్ని తగ్గించేందుకోసం స్మార్ట్ టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటున్నామనీ, ఈ క్రమంలోనే స్మార్ట్ కంట్రోలర్ రాడార్లను అమల్లోకి తెచ్చామన్నారు అల్ మర్రి. రెక్లెస్ డ్రైవింగ్‌ని గుర్తించడం, డాటాను డైరెక్ట్‌గా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కి పంపించడం, అలార్మ్ - వార్నింగ్స్ ద్వారా వాహనదారుల్ని అప్రమత్తం చేయడం ఈ స్మార్ట్ కంట్రోలర్ రాడార్ల ప్రత్యేకత. వీటిని చాలా తేలిగ్గా అమర్చగలగడంతోపాటుగా, తేలిగ్గానే ఇంకో చోటకి తరలించే వీలుంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







