వెంకటేష్ హీరోగా హిందీ సుల్తాన్ తెలుగు లో
- September 25, 2017
విక్టరీ వెంకటేష్ డిఫరెంట్ నేపథ్య కథా చిత్రాలను చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. కథ నచ్చకపోతే ఖాళీగా ఉండి మంచి కథ వచ్చేదాక వెయిట్ చేస్తానంటున్నాడు. ఇప్పుడు లేటెస్ట్ గా ఓ బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాన్ని రీమేక్ చేయడానికి వెంకీ రెడీ అవుతున్నాడనే వార్త ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
గురు చిత్రం తర్వాత వెంకటేష్ మరో చిత్రాన్ని స్టార్ట్ చేయలేదు. అప్పటినుంచి ఖాళీగా ఉంటూనే మంచి స్టోరీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఒకరిద్దరు డైరెక్టర్లతో కమిట్ అయ్యాడనే వార్తలు వచ్చినా అవన్నీ గాసిప్స్ గానే మిగిలిపోయాయి.
బాలీవుడ్లో సూపర్ సక్సెస్ అయిన సుల్తాన్ చిత్రాన్ని వెంకటేష్ రీమేక్ చేయబోతున్నాడట. ఇప్పుడు ఈ వార్త ఫిల్మ్ నగర్ లో హల్ చల్ చేస్తోంది. సల్మాన్ ఖాన్ బిగ్గెస్ట్ హిట్స్ లో సుల్తాన్ ఒకటి. రొమాంటికి స్పోర్ట్స్ డ్రామా ఫిల్మ్ గా తెరకెక్కి, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు సాధించింది సుల్తాన్. ఇప్పుడు వెంకటేష్ సుల్తాన్ పాత్ర పోషించడానికి రెడీ అవుతున్నాడట. సుల్తాన్ రీమేక్ లో రితికా సింగ్ నటిస్తోంది. సుల్తాన్ లో అనుష్క శర్మ రోల్ ని, రితికా చేయబోతుంది. వీరిద్దరి కాంబినేషన్లో అంతకుముందు గురు వచ్చి మెప్పించింది. ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లోనే వెంకటేష్ చేయబోతున్నాడట. త్వరలోనే అఫీషియల్ గా ఈ మూవీ అప్డేట్స్ని ప్రకటించబోతున్నారు..
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







