వేధింపులు తాళలేక మూడో అంతస్థుపై నుంచి కిందికి దూకిన ఓ ఇండోనేషియా మహిళ

- September 25, 2017 , by Maagulf
వేధింపులు తాళలేక  మూడో అంతస్థుపై నుంచి కిందికి దూకిన  ఓ ఇండోనేషియా మహిళ

షార్జా:  పని మనుష్యులంటే తమ బానిసలు అనుకోని వారిని హీనాతిహీనంగా  కొందరు యజమానులు చూస్తున్నారనేది వాస్తవం. ఆ భారతదేశానికి  చెందిన ఓ యజమాని వేధింపులు తాళలేక వారి చెర నుంచి బయటపడేందుకు ఓ ఇండోనేషియా మహిళ  మూడో అంతస్థుపై నుంచి కిందికి దూకింది. ఆ  ప్రయత్నంలో  ఆ మహిళ వికలాంగురాలిగా మారిపోయింది. ఆమె చేసిన సాహసంలో బాధిత మహిళ నడుము, ఓ కాలు విరిగాయి. మూడో అంతస్థు మీద నుంచి ఓ కిటికి గుండా దూకుతున్న ఆమెను ఇరుగుపొరుగువారు గమనించారు. సమాచారాన్ని పోలీసులకు అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిస్సహాయస్థితిలో ఎటూ కదలలేని బాధిత మహిళను అల్ కువైటీ హాస్పిటల్‌కు తరలించారు. మహిళ తీవ్రంగా గాయపడిందని హాస్పిటల్ వైద్యులు తెలిపారు. భారత్‌కు చెందిన యజమాని ఇంట్లో తనతోపాటు మరో మహిళను బంధించాడని, అతడి నుంచి తప్పించుకోవడానికి ఈ ప్రయత్నం చేశానని బాధిత మహిళ పోలీసులకు తెలిపింది. బాధిత మహిళ ఇండోనేషియా పౌరురాలని పోలీసులు తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com