పేదల కోసం ఫ్రీ కరెంట్ : ప్రధాన మంత్రి మోడీ
- September 25, 2017
ప్రధాన మంత్రి మోడీ మరో భారీ ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. దేశం మొత్తాన్ని విద్యుదీకరించాలనేది మోడీ లక్ష్యం. ఇందుకోసం ప్రధాన మంత్రి బిజిలీ సహజ్ యోజన - సౌభాగ్య స్కీమ్‌ను మోడీ ప్రారంభించారు. ఈ స్కీమ్ కింద దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న దేశంలోని 3 కోట్ల మంది లబ్ది పొందనున్నారు. ఈ పథకం కోసం 14 వేల 25 కోట్లను కేటాయించింది కేంద్రం. ఇందులో 12 వేల 300 కోట్లను కేంద్ర ప్రభుత్వం భరించనుంది. ఒక ఫ్యాన్, ఐదు ఎల్‌ఈడీ బల్బులు ఉన్న ఇళ్లకు ఉచిత కరెంటును ఇవ్వాలనేది సౌభాగ్య యోజన పథకం ఉద్దేశం. 2019 మార్చి 31లోగా విద్యుదీకరణ పనులు పూర్తిచేసి లక్ష్యాన్ని చేరుకోవాలనేది మోడీ టార్గెట్.
మరోవైపు దేశంలోని ఆర్థిక సమస్యలను సమీక్షించేందుకు మోడీ కొత్త ఆర్థిక సలహా సంఘాన్ని నియమించారు. ఐదుగురు సభ్యుల ఈ సంఘానికి బిబేక్ దేబ్రాయ్ నేతృత్వం వహిస్తారు. రతన్ వటాల్ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. సుర్జీత్ భల్లా, రతిన్ రాయ్, అషిమా గోయల్ సభ్యులుగా ఉంటారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







