వలసదారుడి సందిగ్ధం ఇంకా తొలగలేదు
- September 26, 2017
మనామా:ఉదైర్ కురుప్పయ్య అనే భారతీయ వలసదారుడు, స్వదేశానికి వెళ్ళేందుకోసం ఇంకా సమస్యల్ని ఎదుర్కొంటూనే ఉన్నాడు. గడచిన రెండేళ్ళుగా అక్రమ నివాసిగా ఉదైర్ కురుప్పయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతనికి స్పాన్సర్‌గా వ్యవహరించిన సౌదీ స్పాన్సర్ కారణంగా ఈ సమస్య తలెత్తింది. సౌదీ అరేబియాలోని ఇండియన్ ఎంబసీ అధికారులు, నెల రోజుల్లోగా తనను ఇండియాకి పంపిస్తామని హామీ ఇచ్చారనీ, అయితే నెలకు పైగా సమయం గడుస్తున్నా బుడైయాలోని ఇంట్లో తాను ఇంకా అలాగే బందీ అయిపోయానని ఉదైర్ కురుప్పయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సౌదీ స్పాన్సర్ ద్వారా విజిట్ వీసాపై కురుప్పయ్య బహ్రెయిన్‌కి వచ్చాడు. కేవలం మూడు నెలల వీసా మీద 2015లో కురుప్పయ్యను తీసుకొచ్చి, ఇక్కడే వదిలేశారు అతని స్పాన్సరర్. చేతిలో డబ్బుల్లేక, అక్రమ వలసదారుడిగా ముద్రపడ్డంతో తన పరిస్థితి దయనీయంగా తయారైందని వాపోతున్నాడు కురుప్పయ్య. అధికారులు తన పరిస్థితిని అర్థం చేసుకుని వీలైనంత త్వరగా స్వదేశానికి పంపే ఏర్పాట్లు చేస్తారని ఆశిస్తున్నట్లు కురుప్పయ్య చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







