దుబాయ్ లో వైల్డ్ వాడి వాటర్ పార్క్ 'బర్త్ డే ' స్పెషల్ ఆఫర్
- September 26, 2017
దుబాయ్: మీ పుట్టినరోజు సందర్భంగా, ఏ నెలలో అయితే మీ పుట్టినరోజు ఉంటుందో ఆ నెలలో మీ ముగ్గురు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో వైల్డ్ వాడి పార్క్‌కి వెళితే, అక్కడ మీకు ఉచితంగా ప్రవేశం లభిస్తుంది. వైల్డ్ వాడి వాటర్ పార్క్ ఈ బంపర్ ఆఫర్‌ని ప్రకటించింది. ఈ ఆఫర్‌ని పొందేందుకు మీ పుట్టినరోజును ధృవీకరించుకునేందుకు ఎమిరేట్స్ ఐడీ లేదా ఒరిజినల్ పాస్‌పోర్ట్‌ని తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. యూఏఈ రెసిడెంట్స్ ఆఫర్, లేడీస్ నైట్ ఆఫర్, లేట్ నైట్ ఫ్రైడేస్ ఆఫర్ వంటివి మరిన్ని ఆకర్షణీయమైన ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. సాధారణ అడ్మిషన్స్ విషయానికొస్తే, 1.1 మీటర్ లేదా అంతకు మించిన హైట్ ఉన్నవారికి 310 దిర్హామ్‌ల టిక్కెట్‌తో వైల్డ్ వాడీ వాటర్ పార్క్‌లోకి ఎంట్రీ లభిస్తుంది. 1.1 మీటర్స్ కంటే తక్కువ హైట్ ఉన్నవారికి టిక్కెట్ ఖరీదు 260 దిర్హామ్‌లు. ఆన్లైన్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుంటే 40 దిర్హామ్‌ల తగ్గింపు లభిస్తుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







