దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్: 1 మిలియన్ డాలర్స్ గెల్చుకున్న రిటైర్డ్ ఇండియన్
- September 26, 2017
దుబాయ్: దుబాయ్‌లో 37 ఏళ్ళుగా ఉంటోన్న ఓ భారత జాతీయుడికి 1 మిలియన్ డాలర్స్ డ్యూటీ ఫ్రీ రఫాల్ బహుమతి దక్కింది. టిక్కెట్ నెంబర్ 0338 ద్వారా ఈ బహుమతిని ఆయన గెల్చుకున్నారు. 3.67 బిలియన్ దిర్హామ్‌లు ఈ బహుమతి ద్వారా ఆయన అందుకునే అవకాశం దక్కింది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియన్ మిలియనీర్ డ్రాలో కలప్పరంబథ్ మొహమ్మద్ అలి ముస్తఫా అనే వ్యక్తి ఈ బహుమతిని గెల్చుకున్నారు. గల్ఫ్ టార్గెట్ హోల్డింగ్ సంస్థలో సేల్స్ రిప్రెజెంటేటివ్‌గా పనిచేసి రిటైర్ అయ్యారీయన. ప్రస్తుతం స్వదేశం ఇండియాలోని కేరళ రాష్ట్రంలో ఉంటున్నారాయన. సదరు సంస్థలో 17 ఏళ్ళపాటు పనిచేశారు మొహమ్మద్. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కాంకోర్స్ బి - టెర్మినల్ 3 వద్ద ఈ డ్రా జరిగింది. జుమైరా బీచ్ హోటెల్‌లో ఆగస్ట్‌లో ఈ టిక్కెట్‌ని మొహమ్మద్ కొనుగోలు చేశారు. ఇది ఊహించని బహుమతి అనీ, ప్రస్తుతానికి ఆ డబ్బుతో ఏం చేయాలనే ఆలోచనలు లేవని ఆనందంగా చెప్పారు మొహమ్మద్.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







