హైదరాబాద్ లో కాంట్రాక్ట్ పెళ్లిళ్ల ఖాజీ అరెస్ట్
- September 26, 2017
హైదరాబాద్ పాతబస్తీలో కాంట్రాక్ట్ మ్యారేజీ అడ్డాలపై ఉక్కుపాదం మోపుతున్నారు సౌత్‌జోన్ పోలీసులు. డీసీపీ సత్యనారాయణ నేతృత్వంలో చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, తలాబ్‌కట్టలో దాడులు జరిగాయి. ఖాజీల ఇళ్లు, ఆఫీసుల్లో ముమ్మరంగా సోదాలు చేశారు. పలువురు షేక్‌లు, బ్రోకర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ముఖ్యమైన సమాచారాన్ని సేకరించారు పోలీసులు.
సోదాల్లో కాంట్రాక్ట్ మ్యారేజ్‌ల కీలక సూత్రదారి ఖాజీ అలీ అబ్దుల్లా రఫైను పోలీసులు అరెస్ట్ చేశారు. రఫైకు చాలామంది అరబ్ షేక్‌లతో లింకులున్నట్లు తేలింది. అతడిచ్చిన సమాచార మేరకే బ్రోకర్ల అడ్డాలను గుర్తించారు. ముమ్మురంగా తనిఖీలు చేసి... మరికొంతమందిని అరెస్ట్ చేశారు. వీరిని ప్రశ్నించిన పోలీసులకు కీలక సమాచారాన్ని రాబట్టారు. రఫైపై పీడీ యాక్ట్‌ను పెట్టేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
పాతబస్తీలో కొంతకాలంగా కాంట్రాక్ట్ మ్యారేజ్‌లు జరుగుతున్నాయి. నెలరోజుల వ్యవధిలోనే దాదాపు నాలుగైదు పెళ్లిళ్లు జరిగాయి. కొంతమంది అరబ్ షేక్‌లను కూడా అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో మొత్తం 38మంది బ్రోకర్లు ఉన్నట్లు పోలీసులు తేల్చారు. అలాగే గతంలో 8మంది అరబ్ షేక్‌లు, 12మంది ఖాజీలు, దళారులను అరెస్ట్ చేశారు. 12మంది బాలికల్ని రక్షించామన్నారు డీసీపీ సత్యనారాయణ.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







