ఐసిసి క్రికెట్‌లో కొత్త నిబంధనలు
- September 26, 2017
క్రికెట్‌లో ఐసీసీ రూపొందించిన కొత్త నిబంధనలు సెప్టెంబర్ 28 నుంచి అమల్లోకి రానున్నాయి. దక్షిణాఫ్రికా - బంగ్లాదేశ్, పాకిస్థాన్ - శ్రీలంక టెస్టు సిరీస్‌ల్లో వీటిని అమలు చేస్తారు. ప్రస్తుతం భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరీస్ మాత్రం పాత నిబంధనల ప్రకారమే నిర్వహిస్తారు.
కొత్త నిబంధనల ప్రకారం బ్యాట్ అంచుల మందం 40 మిల్లీ మీటర్లు మించరాదు. డెప్త్ 67 మిల్లీ మీటర్లు ఉండాలి. బ్యాట్‌ను కొలిచేందుకు అంపైర్లకు ప్రత్యేక కొలమానిని సమకూరుస్తారు. మైదానంలో అంపైర్లు, ప్రత్యర్థి ఆటగాళ్ల పట్ల దురుసుగా, అనుచితంగా ప్రవర్తించే క్రికెటర్లను మైదానం నుంచి బయటకు పంపించే అధికారం అంపైర్లకు ఉంటుంది. ఇక నుంచి టీ20ల్లోనూ డీఆర్‌ఎస్ ఉపయోగించవచ్చు. పరుగు కోసం వచ్చిన బ్యాట్స్‌మన్ క్రీజులో ముందు బ్యాట్ ఆనించిన తర్వాత గాల్లో ఉంటే అప్పుడు బంతి వికెట్ల తాకితే ఇక మీదట నాటౌట్‌గా ప్రకటిస్తారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







