విలన్ గా నటించునన్న నయనతార
- September 26, 2017
నయనతార అంటే అందం. నయన్ అంటే అభినయం. తెలుగు నుంచి మళయాలం వరకు నయన్ ను అభిమానించే వాళ్లు లక్షల్లో ఉన్నారు. అలాంటి ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యేలా నయనతార విలన్ గా మారుతోంది. ఇన్నాళ్లూ తను చూపిస్తోన్న పాజిటివిటీని పక్కనపడేసి, మరో షేడ్ ను చూపించబోతోంది నయన్. చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమాలో నయన్ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చెయ్యబోతోందట. కంప్లీట్ గా విలన్ రోల్ కాకపోయినా, పాజిటివ్ గా కనిపించే పాత్రలో కొంచెం నెగటివ్ షేడ్స్ ను కూడా చూపించే పాత్రలో నయనతార కనిపించబోతోందట. తను ఇప్పటివరకు ఇలాంటి పాత్ర చెయ్యలేదు, పైగా క్యారెక్టర్ ఛాలెంజింగ్ గా ఉంటుంది కాబట్టే, నయన్ సైరా నరసింహా రెడ్డి సినిమాకు ఒప్పుకుందట. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథాంశంతో వస్తోన్న ఈసినిమాలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్ కీరోల్స్ చేస్తున్నారు. ఎ.ఆర్.రెహ్మాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. రామ్ చరణ్ 150కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







