ఆప్గనిస్తాన్‌కు భారత సైనికులను పంపే ప్రసక్తే లేదు:కేంద్ర రక్షణశాఖ మంత్రి
- September 26, 2017
ఢిల్లీ: ఆప్గనిస్తాన్‌కు భారత సైనికులను పంపే ప్రసక్తే లేదని కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అభివృద్ధి, వైద్య సేవలకు తదితర రంగాల్లో ఆఫ్గనిస్తాన్‌కు భారత్ సహాయం చేస్తుందని తెలిపారు. మూడు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చిన అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి జేమ్స్ మ్యాటీస్- రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటి అయ్యారు. ఉగ్రవాదం తదితర అంశాలపై చర్చించారు. అనంతం సంయుక్త మీడియా సమావేశంలో ఇరువురు నేతలు మాట్లాడారు. పాకిస్తాన్‌లో ఉగ్రవాద స్వర్గధామాలు సహించరాదని ఇరుదేశాలు అంగీకారానికి వచ్చినట్లు సీతారామన్ తెలిపారు. ఒకవేళ జేమ్స్ మటిస్ పాకిస్థాన్‌లో పర్యటిస్తే, ఆ దేశంలో ఉగ్రవాద సురక్షిత స్థావరాలు, సరిహద్దుల ఆవలి నుంచి ఎదురవుతున్న ఉగ్రవాద సమస్యలను లేవనెత్తాలని కోరినట్లు ఆమె తెలిపారు. ఉగ్రవాదంతో భారత్, అమెరికాలు నష్టపోయాయని, ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భారత్‌తో కలిసి పనిచేస్తామని జేమ్స్ చెప్పారు. ఉగ్రవాదం ప్రపంచానికి ముప్పుగా పరిణమించిందని జేమ్స్ అన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







