షావుకారు జానకి కి కన్నడ రాజ్యోత్సవ పురస్కారo
- November 01, 2015
సుప్రసిద్ధ నటీమణి షావుకారు జానకిని కర్ణాటక ప్రభుత్వం నేడు సత్కరించనున్నది. కన్నడ రాజ్యోత్సవ పురస్కారాన్ని బహూకరించనున్నది. కర్ణాటక ప్రభుత్వం 60మంది ప్రముఖులను కన్నడ రాజ్యోత్సవ పురస్కారంతో సత్కరిస్తున్నది. ఈ పురస్కారం కింద లక్ష రూపాయిల నగదు, 20 గ్రాముల సువర్ణ పతకాన్ని, సన్మాన పత్రాన్ని అందజేస్తారు. షావుకారు జానకిగా ప్రసిద్ధి చెందిన శంకరమంచి జానకి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సువర్ణాధ్యాయం అనదగ్గ కాలంలో పలు చిత్రాల్లో నటించారు. ఆమె నటించిన షావుకారు చిత్రం పేరే ఆమె ఇంటిపేరుగా సార్థకమైంది. ప్రస్తుతం ఆమె బెంగళూరులో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







