చిరకాల మిత్రుడు సెహ్వాగ్ కి సచిన్ చిరు కానుక

- September 27, 2017 , by Maagulf
చిరకాల మిత్రుడు సెహ్వాగ్ కి సచిన్ చిరు కానుక

మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు మధ్య విడదీయరాని స్నేహబంధం ఉంది. ఓపెనర్లుగా వీరిద్దరూ కలసి భారత్‌కు ఎన్నో విజయాలు అందించారు.  సెహ్వాగ్‌ను ఎంతో ఇష్టపడే సచిన్ అతడికి ఓ అద్భుతమైన బహుమతిని కానుకగా బహుకరించాడు.  ఆ కానుక బీఎండబ్ల్యూ 730 ఎల్‌డీ కారు. దీని ఖరీదు రూ.1.14 కోట్లు.  కారును బహుమతిగా అందుకున్న సెహ్వాగ్ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు.  సచిన్‌కు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలియజేశాడు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com