అద్దెకు ల్యాంప్ పోస్ట్‌లు
- September 28, 2017
మినిస్ట్రీ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్, ఫెడరల్ రోడ్లపై ఉన్న ల్యాంప్ పోస్ట్‌లను అద్దెకు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది. కేవలం ఎమిరేటీ జాతీయులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. యూఏఈ పౌరులు, ఈ ల్యాంప్ పోస్టుల్ని అద్దెకి తీసుకుని, తిరిగి వాటిని ఇంకొకరికి అద్దెకివ్వడం ద్వారా ఆదాయం పొందవచ్చునని అధికారులు అంటున్నారు. మినిస్ట్రీ అండర్ సెక్రెటరీ హస్సన్ మొహమ్మద్ జుమా అల్ మన్సురి మాట్లాడుతూ, ప్రస్తుతం ల్యాంప్ పోస్ట్‌లను, అలాగే అద్దెకు ఇవ్వాలనుకుంటోన్న వెన్యూస్‌ని లెక్కిస్తున్నట్లు, వాటి అద్దెల వివరాల్ని మదింపు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తమ ఉత్పత్తుల్ని, తమ సంస్థల్ని ప్రమోట్ చేసుకోవడానికి అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలపై పలువురు ఆధారపడుతున్నారు. అలాంటివారికి ఈ ల్యాంప్ పోస్ట్‌లు ఎంతో ఉపయుక్తంగా మారతాయి. ఎమిరేటీలకు ఈ ల్యాంప్ పోస్ట్‌ల అద్దె ద్వారా భృతి దొరుకుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







