పీహెచ్‌డీ సాధించిన బఫే వర్కర్‌

- September 28, 2017 , by Maagulf
పీహెచ్‌డీ సాధించిన బఫే వర్కర్‌

అల్‌ అహ్సా: యెమనీ జాతీయుడైన సలెహ్‌ అనే యువకుడు, ప్రముఖ బఫెట్‌ రెస్టారెంట్‌లో పనిచేస్తున్నాడు. తన తండ్రితో కలిసి చిన్నప్పటినుంచీ ఈ పని చేస్తున్నాడు. అయితే చదువుకోవాలన్న తన ఆలోచనల్ని మాత్రం విడిచిపెట్టలేదు. యెమెన్‌ నుంచి హై సెకెండరీ స్కూల్‌ సర్టిఫికెట్‌ని పొందిన సలేహ్‌, ఖురానిక్‌ సైన్సెస్‌లో బ్యాచిలర్‌ డిగ్రీని కూడా పొందాడు. ఆ తర్వాతా చదువు కొనసాగించిన సలెహ్‌, మాస్టర్‌ డిగ్రీని పొంది అల్‌ అహ్సాకి వచ్చి తిరిగి తన తండ్రి, సోదరుడితో కలిసి రెస్టారెంట్‌లో పనిచేస్తున్నాడు. పీహెచ్‌డీ చేయాలన్న కోరికతో సుడాన్‌ వెళ్ళి, అక్కడ ఒండోర్మాన్‌ ఇస్లామిక్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డి పూర్తి చేసి, తిరిగి వచ్చినట్లు సలెహ్‌ వెల్లడించాడు. పీహెచ్‌డీ సాధించిన సలెహ్‌ని అతను పనిచేసే రెస్టారెంట్‌కి వచ్చే వినియోగదారులు 'డాక్టర్‌ సలెహ్‌' అని పిలుస్తోంటే ఆయనకి ఎంతో గర్వకారణంగా ఉంటోందట. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com