పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డ బాలీవుడ్ నటి విద్యా బాలన్‌

- September 29, 2017 , by Maagulf
పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డ బాలీవుడ్ నటి విద్యా బాలన్‌

బాలీవుడ్ హాట్ బ్యూటీ విద్యా బాలన్‌ పెను ప్రమాదం నుండి బయటపడింది.. బుధవారం ఓ కార్యక్రమం నిమిత్తం ముంబయిలోని బాంద్రాకు వెళ్తుండగా, ఆమె ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో విద్యకు కానీ ఆమె డ్రైవర్‌కు కానీ ఎలాంటి గాయాలు కాకపోవడం తో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన కు సంబదించిన పూర్తి వివరాలు బయటకు తెలియనప్పటికీ , కేవలం ఈ ఘటన జరిగినట్లు అని సోషల్ మీడియా ద్వారా బయటకు తెలిసింది.
గత ఏడాది విద్యా 'బేగమ్‌ జాన్‌' తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ మూవీ అనుకున్న స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఆమె 'తుమారీ సులు' చిత్రంలో లేట్‌ నైట్‌ ఆర్జే పాత్రలో నటిస్తున్నారు. సురేశ్‌ త్రివేణి దర్శకుడు. నవంబర్‌ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com