బెంగళూరులోని పెట్రోల్ కొంటే.. బిర్యానీ ఉచితం
- September 29, 2017
పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. దీంతో వారికి కొంతమేర ఉపశమనం కలిగించేందుకు బెంగళూరులోని ఓ పెట్రోల్ బంకు నిర్వాహకులు వినూత్నమైన ఆలోచన చేశారు. రూ.250తో పెట్రోల్ కొంటే.. వారికి ఉచితంగా బిర్యానీ అందిస్తున్నారు. ఓల్డ్ మద్రాస్ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర సర్వీస్ స్టేషన్ ఈ ఆఫర్‌ను పెట్టింది. తమ వద్దకు వచ్చి పెట్రోల్ కొనుగోలు చేసే వినియోగదారులకు ఉచితంగా బిర్యానీ అందిస్తుంది.
ఈ ఆఫర్ అక్టోబర్ 6వరకు ఉంది. డీజిల్ కొనుగోలు చేసే వినియోగదారులకు మాత్రం ఈ ఆఫర్ వర్తించదండోయ్. పెట్రోల్ కొనుగోలు చేసిన ధరను బట్టి వినియోగదారులకు టీ, కాఫీ, సమోసా, కుకీస్‌తో పాటు బిర్యానీ ఇస్తున్నారు. ఓ వైపు పెట్రోల్.. మరో వైపు నోరూరించే బిర్యానీ ఆఫర్ భలే ఉంది కదూ..!
తాజా వార్తలు
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..







