సీనియర్ జర్నలిస్టులకు రక్షణ కల్పించండి అని కోరుతూ హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ
- September 29, 2017
సీనియర్ జర్నలిస్టులు రాజ్ దీప్ సర్ దేశాయ్ (ఇండియా టుడే), రవీష్ కుమార్ (ఎన్డీటీవీ) లకు నెటిజన్లలో ఓ వర్గం నుంచి తీవ్రమైన బెదిరింపులు అందుతున్నాయని, అందువల్ల వీరికి వెంటనే రక్షణ కల్పించాలని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్, ఎంపీ అశోక్ చవాన్ కోరారు. ఈ మేరకు ఆయన హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో తమ విధులను నిర్వర్తిస్తున్న ఈ జర్నలిస్టులకు ప్రాణహాని ఉందన్న ఆందోళనను ఆయన వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా వీరి భద్రతపై దృష్టి పెట్టాలని కోరారు. ఎం.ఎన్. కల్ బర్గి, గోవింద్ పన్నారే, గౌరీ లంకేశ్ వంటి జర్నలిస్టులు, రచయితల దారుణ హత్యల గురించి ప్రస్తావించిన ఆయన.. ఇలాంటి ఘటనలు ఈ స్వతంత్ర భారత చరిత్రలోనే సిగ్గుచేటని పేర్కొన్నారు. రాజ్ దీప్ సర్ దేశాయ్, రవీష్ కుమార్ ల రక్షణకు తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







