ఓపెన్ రైడ్: మహిళా బైకర్లు సిద్ధం
- September 29, 2017
యు.ఏ.ఈ: 30 ఏళ్ళ ఎమిరేటీ మహిళ చాంతల్ అసాద్, 34 ఏళ్ళ బ్రిటిష్ జాతీయురాలు కేథరీన్ హెక్టార్, 'ఓపెన్ రోడ్' పేరుతో స్థానికంగా ప్రొడ్యూస్ అవుతోన్న ట్రావెల్ షో 'ఓపెన్ రోడ్' కోసం ముందుకొచ్చారు. మిడిల్ ఈస్ట్‌లోని మూడు దేశాల్లో ఈ ఇద్దరు మహిళా బైకర్లు పర్యటిస్తారు. ఆ వివరాలు ప్రస్తుతానికి గోప్యం. త్వరలో ఫాక్స్ లైఫ్ ఛానల్లో ఈ రోడ్ షో ప్రసారం కానుంది. ఈ ఇద్దరు మహిళలు ఆ మూడు దేశాల్లోని ప్రత్యేకతల్ని తమ కళ్ళతో చూపించబోతున్నారు. మహిళల డ్రైవింగ్‌పై కొన్ని అభ్యంతరాలు, అలాగే కొన్ని అసమానతలు ఉన్నప్పటికీ అవేవీ తమ షోకి అడ్డంకి కాలేదనీ, అందరిలోనూ అవగాహన కల్పించేలా, దైర్యం పెంపొందించేలా, ఆత్మవిశ్వాసం కల్గించేలా తమ యాత్ర కొనసాగనుందని ఈ ఇద్దరు బైకర్లు చెబుతున్నారు. ఇదొక అడ్వెంచర్ టూర్ అనీ, ఒక్కోసారి తమ బైక్‌లను తామే రిపెయిర్ కూడా చేసుకోవాల్సి వచ్చిందని వారు తెలిపారు. అక్టోబర్‌లో ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి, ఆ తర్వాత ఫిల్మింగ్కి వెళతారు. డిసెంబర్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తవుతాయి. ఫిబ్రవరిలో ఈ రోడ్ షోని ప్రసారం చేయనున్నారు.
తాజా వార్తలు
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు









