నాగశౌర్య తాజా సినిమాకు హిందిలో ఆల్‌రైట్స్ కి గాను 1.25 కొట్లు
- September 30, 2017
“ఊహలు గుసగుసలాడే”, “దిక్కులు చూడకు రామయ్య”, “లక్ష్మిరావే మా ఇంటికి”, “కళ్యాణవైభోగం”,” జ్యోఅచ్చుతానంద” లాంటి విభిన్న కథాంశాలతో విజయాలు సాధించి తెలుగు ప్రేక్షకుల్లో ముఖ్యంగా ఫ్యామిలి ఆడియన్స్‌లో ప్రత్యేక స్థానం సంపాదించిన నాగశౌర్య హీరోగా చేస్తున్న చిత్రానికి హిందిలో ఆల్‌రైట్స్ కి గాను 1.25 కొట్లు ఫ్యాన్సీ రేట్ తో అమ్ముడుపోయాయి. ఈ చిత్రాన్ని ఉషా ముల్పూరి, శంకర ప్రసాద్ ముల్పూరి లు సంయుక్తంగా ఐరా క్రియోషన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. అతి త్వరలో ఈ చిత్రానికి టైటిల్ ఖరారు చేయనున్నారు. కన్నడ లో “కిరిక్ పార్టి” అనే చిత్రంలో తన క్యూట్ ఫెర్‌ఫార్మెన్స్ తో అందరి మనసులు దొచుకున్న రష్మిక మండన్న హీరోయిన్ గా తెలుగుకి పరిచయం చేస్తూ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వద్ద దర్శకత్వ శాఖ లో పనిచేసిన వెంకి కుడుముల ని దర్శకుడిగా పరిచయం చేస్తూ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లవ్ ఎంటర్‌టైనర్ గా కాలేజి బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ చిత్రం నవంబర్ చివిరి వారంలో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. హైదరాబాద్, గుంటూరు పరిసర ప్రాంతాల్లో షూట్ జరుపుకుంటోన్న ఈ సినిమా చివరి దశకు చేరుకుంది. అయితే ఇంకా సెట్స్ పైనే ఉన్న ఈ సినిమాకు సంబంధించిన హిందీ ఆల్ రైట్స్ కోటీ పాతిక లక్షలకు అమ్మడవటం విశేషం.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







