ఆస్ట్రియాలో బురఖా ధరిస్తే రూ.11,000 జరిమానా
- October 02, 2017
ఆస్ట్రియాలో ముఖాన్ని పూర్తిగా కప్పుకునే వస్త్రాలను ధరించడంపై నిషేధం అమల్లోకి వచ్చింది. ఇస్లాం సంప్రదాయం ప్రకారం బురఖా ధరించడం కూడా శిక్షార్హమే. ఆసుపత్రుల బయట సర్జికల్ మాస్క్లు, బహిరంగంగా పార్టీ మాస్క్లు వంటివాటిని ధరించడంపై కూడా నిషేధం ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. అతి సంప్రదాయ ముస్లిం మహిళలు ధరించే బురఖాపై నిషేధం విధించేందుకే ఈ చట్టాన్ని ఆమోదించినట్లు కొందరు చెప్తున్నారు. ఈ చట్టాన్ని ఉల్లంఘించినవారికి 150 యూరోలు (సుమారు రూ.11,770) జరిమానా విధించవచ్చు. ప్రజలు తమ ముఖాలను చూపించేందుకు నిరాకరిస్తే, వారిపై బల ప్రయోగం చేయడానికి కూడా పోలీసులకు అధికారం ఉంది.
ఫ్రాన్స్, బెల్జియంలలో కూడా ఇటువంటి చట్టాలు అమలవుతున్నాయి. జర్మనీలో కూడా ఇదే తరహాలో చట్టాలను ఆమోదించాలని నేషనలిస్ట్ ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ పార్టీ డిమాండ్ చేస్తోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







