చేపల మార్కెట్లో తన్నుకున్న ఆరుగురికి దేశ బహిష్కరణ

- October 02, 2017 , by Maagulf
చేపల మార్కెట్లో  తన్నుకున్న ఆరుగురికి దేశ బహిష్కరణ

కువైట్ : చేపల మార్కెట్లో తన్నుకొన్న ఆరుగురు నిందితులను ఆదివారం అరెస్టు చేశారు. ఈ కొట్లాటలో ముగ్గురు ఇరానియన్లు మరియు ముగ్గురు ఈజిప్షియన్లు పాల్గొన్నారు. ఆదివారం జరిగిన ఈ వీధి పోరాటాన్ని ఎవరో మొబైల్ ఫోన్ లో  చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు, ఆ వీడియో క్లిప్పు కాస్త  వైరల్ గా మారి భద్రతా వ్యవహారాల కోసం అసిస్టెంట్ అండర్ ప్రెసిడెంట్ మేజర్ జనరల్ ఇబ్రహీం అల్-తారహ దృష్టిలో సైతం పడింది. దాంతో ఆగ్రహించిన ఆయన ఈ పోరాటంలో పాల్గొన్న ఆరుగురు వ్యక్తులను  దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com