గూగుల్ లో గల్లంతైన పవన్ కళ్యాణ్ పేరు
- October 02, 2017
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ పేరు మార్చేసింది గూగుల్ సెర్చ్ ఇంజిన్.. అదేంటి అంటారా పవన్ కళ్యాణ్ అని గూగుల్ లో టైప్ చేసి చూస్తే కుషాల్ బాబు అని వస్తుంది. అదేంటో విచిత్రం ఎవరికి అంతు చిక్కట్లేదు. పవన్ పేరు మార్చుకున్నాడా లేక త్రివిక్రం సినిమా కోసం పవన్ కుషాల్ బాబు అయ్యాడా అన్నది తెలియాల్సి ఉంది.
కొణిదెల కళ్యాన్ బాబు కాస్తా పవన్ కళ్యాణ్ అయ్యాడు. ఇక యూత్ లో తన పవర్ ఫుల్ ఫాలోయింగ్ చూసి ఆయనకు పవర్ స్టార్ అనే స్క్రీన్ నేం ఇచ్చేశారు. సౌత్ లో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవర్ స్టార్ ఇలా గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో కుషాల్ బాబు అని కనబడటం కాస్త షాకింగ్ గానే ఉంది.
దీనిలో అసలు విషయం ఏమై ఉంటుందా అని ఫ్యాన్స్ కన్ ఫ్యూజ్ అవుతున్నారు. ప్రస్తుతం త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న పవన్ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవనుంది. ఈ సినిమా టైటిల్ గా అజ్ఞాతవాసి అని పెట్టబోతున్నారట. అయితే ఒకవేళ ఆ సినిమాలో కుషాల్ బాబు అని పేరు పెట్టినా మీడియాకు తెలియకుండా గూగుల్ కు ఎలా తెలుస్తుంది అన్నది ఇక్కడ మ్యాటర్.
కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంలో ఈ సినిమాను కె.రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు. సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్న పవర్ స్టార్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







