రోడ్డు మార్గం కోసం నెజాద్ వాసుల ఆవేదన
- October 02, 2017
అభా: నెజాద్‌కి వెళ్ళే మౌంటెయిన్ రోడ్ కోసం అక్కడి గ్రామస్థులు కలత చెందుతున్నారు. గ్రామానికి వెళ్ళే రోడ్డు ప్రమాదకరంగా మారడంతో ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1970 తర్వాత ఈ రోడ్డుని ఇంతవరకూ ఎవరూ పట్టించుకోలేదనేది స్థానికుల ఆరోపణ. రోడ్డుతోపాటుగా, సరైన ఇన్‌ప్రాస్ట్రక్చర్ లేకపోవడం, విద్యుత్ సమస్యలు తమను ఇబ్బంది పెడుతున్నాయని వారు చెప్పారు. అబ్దుల్లా అల్ అస్మారి అనే ఓ గ్రామస్తుడు మాట్లాడుతూ, సంబంధిత అధికారులు ఎందుకు తమను పట్టించుకోవడంలేదో అర్థం కావడంలేదని అన్నారు. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్‌కి ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్ల దుస్థితి కారణంగా వాటర్ ట్యాంకులు, ట్రక్‌లు విలేజ్‌కి రాలేకపోతున్నట్లు చెప్పాడాయన. వృద్ధులు ఈ మార్గంలో ప్రయాణించడం నరకప్రాయంగా మారిందంటున్నారు. బాహ్యప్రపంచంతో విలేజ్‌కి సంబంధాలు దాదాపుగా తెగిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడివారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







