పాలిటిక్స్ పై పెదవి విప్పిన రజనీ
- October 03, 2017
రాజకీయాల్లోకి వచ్చే విషయమై తర్జన భర్జనలు పడుతున్న రజనీకాంత్ ఒక చిన్న ముందడుగు వేసాడు. రజనీ పేరవై పేరుతో వెబ్ సైట్ ఏర్పాటు చేసాడు. రజనీ పేరవై పేరుతో ఏర్పాటైన వెబ్ సైట్ లో అభిమానులు రిజిస్టర్ చేసుకోవచ్చు. అయితే రిజిస్టర్ చేసుకునేటపుడు పేరు ఫోన్ నంబర్ తో పాటు కావాలనుకుంటే ఓటర్ ఐడి నంబర్ కూడా ఇవ్వచ్చు. ఇక రజనీ ఫ్యాన్స్ అందరూ ఇందులో సభులుగా చేరాల్సిందిగా కోరిన రజనీ ఫ్యాన్స్ అధ్యక్షులు, ఒక్కొక్కరు మరో పది మందిని కూడా ఇందులో చేర్పించాల్సిందిగా విఙ్ఞప్తి చేసారు. రజనీ గురించిన పొలిటికల్ అప్ డేట్స్ ఈ సైట్ ద్వారా సభ్యులు తెలుసుకోవచ్చు. దసరా రోజు ప్రారంభమైన ఈ సైట్ కి ఎలాంటి ఆదరణ వస్తోందో కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. కానీ రజనీ పాలిటిక్స్ లోకి ఖచ్చితంగా వస్తున్నాడని మాత్రం ఇలాంటి వాటి వల్ల బాగా నిర్ధారణ అవుతొందీ మధ్య.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







