భవనంపైనుంచి పడి భారతీయ గర్భిణి మృతి
- October 03, 2017
షార్జాలో ఓ భవనం మీద నుంచి పడి, ఓ గర్భిణి మృతి చెందింది. ప్రాథమిక విచారణ అనంతరం ఈ ఘటనను ఆత్మహత్యగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అల్ మజిజ్ ప్రాంతంలోని ఓ హై రైజ్ భవనంలోగల ఏడవ అంతస్తు నుంచి 32 ఏళ్ళ భారతీయ మహిళ కింద పడిపోయింది. ఉదయం 9.30 నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఐదేళ్ళ కుమార్తె ఉంది మృతురాలికి. ప్రస్తుతం ఆమె మూడు నెలల గర్భవతి అని ఆ భవనంలో నివసిస్తున్న వారు చెప్పారు. మృతురాలు ఆ భవనంలోని మూడో అంతస్తులో నివసిస్తుండగా, తన స్నేహితురాలిని కలిసేందుకు ఏడో అంతస్తులోకి వెళ్ళింది. అక్కడ ఆమె, తన స్నేహితురాలితో మాట్లాడుతూ, మంచి నీళ్ళు కావాలని అడగడం, స్నేహితురాలు అలా వెళ్ళగా ఆమె భవనం నుంచి కిందికి దూకేసిందని తెలియవస్తోంది. మృతురాలి సంబంధీకుల్ని పోలీసులు విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







