లండన్లో విజయ్ మాల్యా అరెస్ట్, బెయిల్ పై విడుదల
- October 03, 2017
ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాను లండన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మనీలాండరింగ్ కేసులో మాల్యాను అరెస్టు చేసినట్లు సమాచారం. భారత్లోని బ్యాంకులకు దాదాపు రూ.9వేల కోట్లను ఎగవేసిన మాల్యా లండన్ వెళ్లి తలదాచుకుంటున్నాడు. అతడిని అప్పగించమని భారత ప్రభుత్వం బ్రిటన్ను కోరింది. అందుకు అంగీకరించిన బ్రిటన్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. మనీలాండరింగ్ కేసులో మాల్యాను లండన్ పోలీసులు అరెస్టు చేయడం ఇది రెండో సారి. అయితే ఆయనకు వెంటనే బెయిల్ రావడంతో విడుదలయ్యారు.
ఏప్రిల్ నెలలో మాల్యాను లండన్ పోలీసులు అరెస్టు చేశారు. కానీ కొద్ది సేపటికే అతడు బెయిల్పై విడుదలయ్యాడు. వేల కోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగ్గొట్టి మార్చి 2016 నుంచి మాల్యా బ్రిటన్లో ఉంటున్నాడు. మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా విచారణకు హాజరుకావాల్సిందిగా పలుమార్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







