బ్రెజిల్లో భారీ బ్యాంకు దోపిడి రూ.2,077 కోట్లు స్వాహా
- October 03, 2017
బ్యాంక్ ఆఫ్ బ్రెజిల్లో భారీ బ్యాంకు దోపిడి జరిగింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించిన దుండగులు అర కిలోమీటరు మేర సొరంగ మార్గాన్ని తవ్వి బ్యాంకులోకి చొరబడ్డారు. 317మిలియన్ డాలర్లు ( రూ. 2077కోట్లు ) కొల్లగొట్టారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీస్ ఉన్నతాధికారులు..బ్యాంకు నుంచి 500 మీటర్ల దూరంలో భారీ సొరంగ మార్గాన్ని కనుగొన్నారు. సొరంగ మార్గంలో పెద్ద ఎత్తున ఆహారపదార్థాల నిల్వలు, శీతల పానీయాలు, ఇతర నిత్యా వసర సరుకులను గుర్తించారు. సొరంగమార్గాన్ని తవ్విన దుండగులు ఈ నిల్వలు సమకూర్చుకున్నట్టు గుర్తించారు. ఈకేసులో 16మంది నింది తులను అదుపులోకి తీసుకుని విచారించారు. నాలుగు నెలల పాటు సొరంగాన్ని తవ్వినట్టు ప్రాథమిక విచారణలో నిందితులు అంగీకరించారు. ప్రపంచంలో జరిగిన చోరీల్లో ఇదే అతిపెద్దదని పోలీస్ అధికారి లోప్ తెలిపారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









