ఉగ్రదాడుల వీడియోలు చూస్తున్నారా అయితే జైలు శిక్షకు సిద్దంకండి
- October 03, 2017
- బ్రిటన్ ప్రభుత్వ హెచ్చరిక
యువత ఉగ్రవాదం వైపు ఆకర్షితులు కావడం పట్ల బ్రిటన్ ప్రభుత్వం ఆందోళన వ్యకం చేస్తున్నది. సామాజిక మాధ్యమాల్లో ఉగ్రదాడులకు సంబంధించిన వీడియోల పట్ల ఆకర్షితులై వందలాది మంది యువతీయువకులు ఉగ్రసంస్థల్లో చేరుతున్నట్టు ఇటీవల నిర్వహించిన ఓ సర్వే ద్వారా గుర్తించింది. దీంతో, ఆన్‌లైన్‌లో ఉగ్రసంస్థల దాడుల వీడియోలను చూస్తున్న నెటిజన్లపై కఠిన చర్యలు చేపట్టేందుకు సన్నద్ధమైంది. ఇకపై ఉగ్రదాడుల వీడియోలను వీక్షించే నెటిజన్లకు 15ఏండ్ల జైలుశిక్ష విధించనున్నట్టు హెచ్చరించింది. మంగళవారం లండన్ నగరంలో కన్సర్వేటివ్ పార్టీ సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న బ్రిటన్ హోంశాఖ మంత్రి అంబర్ రూడ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బ్రిటన్‌లో గతంలో జరిగిన ఆత్మాహుతి దాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఐఎస్ ఉగ్రసంస్థకు చెందిన ఆన్‌లైన్ లింక్‌లను 44వేల మంది సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసినట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం అందిందన్నారు. అంతేగాకుండా, ఇటీవలి కాలంలో బ్రిటన్‌లో యాసిడ్ దాడుల ఘటనలు పెరిగిపోవడం పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







