హాస్య నటుడు బ్రహ్మానందానికి అమెరికా సత్కారం
- October 03, 2017
తెలుగు ఇండస్ట్రీకి బ్రహ్మానందం లాంటి హాస్య నటుడు దొరకడం అదృష్టంగా చెప్పుకోవచ్చు. స్టార్ హీరోలకు తగ్గ రేంజ్లో తన పాత్రల్ని కూడా మలిచి దర్శకులు బ్రహానందాన్ని స్టార్ కమెడియన్ని చేశారు. జంధ్యాల అనే హాస్య చిత్ర శిల్పి చేతిలో అద్భుతంగా చెక్కబడిన హాస్యానందం బ్రహ్మానందం. 1985లోనే నట జీవితానికి శ్రీకారం చుట్టినా, తొలిసారి విడుదలయిన చిత్రం మాత్రం జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన 'అహ నా పెళ్లంట'. తొలి సినిమాతోనే నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. అప్పటి నుంచి దాదాపు ప్రతి సినిమాలో తన మార్కు కామెడీని పండిస్తూ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తూనే ఉన్నాడు. అలాంటి అరుదైన వ్యక్తిని అనేక గౌరవ సత్కారాలు వరించాయి. ఇప్పుడు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ సౌత్ ఏషియా సెంటర్ ఆయన్ని ఘనంగా సత్కరించనుంది. ఈ నెల 6న సౌత్ ఏషియన్ ఫిలిం ఫెస్టివల్ అమెరికాలో జరగబోయే ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా బ్రహ్మానందాన్ని ఆహ్వానించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందాన్ని సత్కరిస్తారు. 1964లో జకార్తా చిత్రోత్సవంలో ఇలాంటి గౌరవం పొందిన గొప్ప నటుడు ఎస్వీ రంగారావు. ఆ తరువాత ఆ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న నటుడు మన హాస్య బ్రహ్మ 'బ్రహ్మానందం'. ప్రస్తుతం 'ఆచారి అమెరికా యాత్ర'లో నటిస్తూ అమెరికాలోనే ఉన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







