నాగ చైతన్య-సమంత పెళ్లి గోవాలో గ్రాండ్ గా....
- October 04, 2017
నాగ చైతన్య సమంత పెళ్లి వేదిక ఫిక్స్ అయింది. హిందూ - క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతిలో గోవాలో గ్రాండ్ గా నిర్వహించేందుకు అక్కినేని ఫ్యామిలీ సిద్ధమైంది. అతికొద్ది మంది మాత్రమే ఈ వివాహ మహోత్సవానికి అటెండ్ అవుతున్నారు. అయితే, టాలీవుడ్ కోసం స్పెషల్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు అక్కినేని నాగార్జున.
అక్కినేని వారింట పెళ్లి సందడి మొదలైపోయింది. అభిమానులతోపాటు, సెలబ్రిటీలు కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అక్కినేని నాగచైతన్య, సమంతల వివాహం ఈనెల 6, 7 తేదీల్లో జరగబోతోంది. హిందూ, క్రైస్తవ సంప్రదాయాల్లో వివాహం జరగనుంది. ఏ మాయే చేశావే సినిమాతో స్క్రీన్‌ని షేర్ చేసుకున్న జంట.. ఇప్పుడు జీవితాన్ని షేర్ చేసుకోబోతోంది. కేవలం మూడు ఫ్యామిలీల సమక్షంలోనే పెళ్లి వేడుకను నిర్వహించనున్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. సమంత పెళ్లి దుస్తుల అలంకరణ బాధ్యతల్ని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ క్రేశాబజాజ్‌కు అప్పగించింది. నిశ్చితార్థం సమయంలోనూ సమంత ధరించిన లెహంగాను క్రేశానే డిజైన్ చేశారు. పెళ్లికి కొన్ని రోజుల ముందే సమంత ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ ప్రారంభించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో రోజుకో ఫొటో షేర్ చేస్తూ అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తోంది. అయితే సమంత ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ నెక్లెస్ ఫొటో పోస్ట్ చేసింది. దాంతో పెళ్లిలో సమంత ఇదే నెక్లెస్ ధరించబోతోందని నెటిజన్లు తెగలైక్‌లు, కామెంట్లు గుప్పిస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







