హైదరాబాద్ భారీ వర్షాలకు రాజమౌళి, రోజా, శర్వానంద్ వంటి వారు కూడా బాధితులే..
- October 04, 2017
మనుషులకే కానీ బేధభావాలు... ప్రకృతికి ఉండదు. ప్రకృతి కన్నెర చేస్తే.. సామాన్యులైనా.. సెలబ్రిటీలైనా ఇబ్బందులు ఎదుర్కొనాల్సిందే... రెండు రోజులనుంచి హైదరాబాద్ లో ముంచెత్తుతున్న వర్షాలతో సామాన్యులతో పాటు.. సినీ ప్రముఖులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్తితి ఏర్పడింది. హైదరాబాద్ లోని జూబ్లీ, బంజారా హిల్స్ ల తర్వాత ఎక్కువగా సిటీ కి దూరంగా ఉన్న మణికొండ ప్రాంతంలో సినీ సెలబ్రిటీలు తమ నివాసాలు ఏర్పరచుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు మణికొండ లోని పంచవటి కాలనీలో నివాసముండే ప్రముఖ దర్శకుడు రాజమౌళి తో పాటు.. రోజా, శివబాలాజీ, శర్వానంద్ వంటి సినీ ప్రముఖులు కూడా వర్ష బాధితులే..!!
పంచవటి కాలనీకి పైభాగంలో ఉండే బుల్కాపూర్ నాలా దెబ్బతినడంతో వరదనీరు కాలనీని ముంచెత్తింది.. దీంతో రోజా, శర్వానంద్ ఇళ్లతో సహా... శివబాలాజీ నివాసం ఉండే శ్యామ్స్ వింటేజ్ అపార్ట్ మెంట్స్ సెల్లార్ పూర్తిగా నీటమునిగిపోయింది. ఇక రాజమౌళి గెస్ట్ హౌస్ పూర్తిగా నీట మునిగింది. దీంతో మినీ థియేటర్ దెబ్బతింది అని తెలుస్తోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







