జూలీ 2 మూవీ కేవలం పెద్దలకు మాత్రమే
- October 04, 2017
గత కొంత కాలంగా బాలీవుడ్ లో బయోపిక్ ల తో పాటు.. అడల్ట్ కంటెంట్ సినిమాలు హవా చెలాయిస్తున్నాయి. గతంలో నేహా దుపియా హీరోగా తెరకెక్కిన జూలీ సినిమాలో అప్పట్లో సెన్సేషనల్ హిట్... నేహా దుపియా ఏమీ దాచుకోకుండా చూపించిన అందాలకు బాక్సాఫీస్ దాసోహం... కాగా తాజాగా 'జూలీ' కి సీక్వెల్ గా జూలీ 2 తెరకెక్కుతున్నది. టాలీవుడ్ లో ఐటెమ్ సాంగ్స్ తో అలరిస్తున్న రాయ్ లక్ష్మి హీరోయిన్ గా శివదాసాన్ని జూలీ 2 సినిమా రూపొందిస్తున్నాడు. బాలీవుడ్ లో తొలిసారిగా అడుగు పెడుతున్న రత్తాలు.. ఈ సినిమాలో బోల్డ్ అండ్ బ్యూటీ ఫుల్ గా కనిపించబోతున్నదట. ఈ సినిమాలో రాయ్ లక్ష్మి పేరు బదులు సెక్సీ రాయ్ అని పిలుస్తారు అనే టాక్ కూడా బీ టౌన్ లో వినిపిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ లో చీకటి కోణాలతో పాటు.. అండర్ వరల్డ్ , రాజకీయాలు ఎలా ప్రభావితం చేస్తున్నాయో చూపిస్తారని అంటున్నారు. ఒక అమ్మాయి హీరోయిన్ గా ఎదగడానికి చేసే ప్రయత్నంలో ఆ అమ్మాయికి నిర్మాతలతో ఉండే ఎఫైర్స్, సెలబ్రెటీల తో రొమాన్స్ .. చివరకు నిర్మాత దర్శకుడు అయిన ఓ పెద్ద వ్యక్తి ఆ హీరోయిన్ జీవితంతో ఎలా ఆడుకుంటాడు .. ఆ జీవితం నుంచి హీరోయిన్ ట్యాగ్ నుంచి బయట పడి.. సాధారణ జీవితంలోకి ఆ అమ్మాయి ఎలా అడుగు పెడుతుంది అని జూలీ 2 సినిమా కథ అని టాక్ వినిపిస్తోంది. అయితే ట్రైలర్ చూస్తే.. అడల్ట్ సినిమా తీసినట్లు కనిపిస్తుంది.. కాగా రోజు రోజుకీ రాయ్ లక్ష్మి పోస్టర్స్ ను చూస్తుంటే.. సినిమాలో కంటెంట్ ఎంత నింపాడో తెలియదు కానీ.. రాయ్ లక్ష్మీ గ్లామర్ తో మాత్రం నింపాడు అని కామెంట్స్ పడుతున్నాయి. అక్టోబర్ 6 న ప్రేక్షకుల ముందు కు రాబోతున్న ఈ సినిమాలోని ఒక్కొక్క పోస్టర్ లో రాయ్ లక్ష్మి లుక్ కుర్రకారుకి మతులు పోగొతున్నది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







