ఆ సాహసం నేను చేయలేను - తారక్
- October 04, 2017
హైదరాబాద్: తన తాతయ్య నందమూరి తారక రామారావు పాత్రలో నటించేంత ధైర్యం తనకు లేదని కథానాయకుడు తారక్ అన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ జీవిత కథతో ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. 'నేనే రాజు నేనే మంత్రి'తో ఇటీవల మంచి హిట్ అందుకున్న దర్శకుడు తేజ ఈ బయోపిక్‌ను తెరకెక్కించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రంలో నటిస్తారా? అని ఓ ఆంగ్లపత్రిక తారక్‌ను ప్రశ్నించింది. దీనికి ఆయన స్పందిస్తూ.. 'నాకు అంత ధైర్యం లేదు. ఆ పాత్రలో నేను నటించలేనని కాదు.. ఆ ప్రయత్నం చేసే ఉద్దేశం లేదు.' అని అన్నారు.
'మా తాతయ్య ఆరోజు కుటుంబాన్ని విడిచి ప్రజలకు సేవ చేయడానికి (రాజకీయాల్లోకి) వెళ్లి, రాష్ట్ర ప్రజల ఆస్తిగా మారారు. ఆయన జీవితం గురించి సినిమా తీస్తామని ఎవరు ముందుకొచ్చినా.. మరొకరు దాన్ని ఆపగలరని నేను అనుకోవడం లేదు. ఆయనపై సినిమా తీసే స్వేచ్ఛ అందరికీ ఉంది.' అని తారక్ చెప్పారు.
ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కిస్తానని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తొలుత ప్రకటించారు. తర్వాత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి పేరుతో ఆ సినిమా తీస్తానని పేర్కొన్నారు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' టైటిల్‌తో తెరకెక్కించనున్న ఈ చిత్రం లక్ష్మీపార్వతి దృష్టి కోణం నుంచి ఉంటుందని చెప్పారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను కూడా వర్మ విడుదల చేశారు.
తారక్ ఇటీవల 'జై లవకుశ'తో మంచి హిట్ అందుకున్నారు. ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశీఖన్నా, నివేదా థామస్ కథానాయికలుగా నటించారు. తమన్నా ఓ ప్రత్యేక గీతంలో మెరిశారు. తారక్ ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







