పవన్ కళ్యాణ్ అభిమానులపై మాజి భార్య రేణు దేశాయ్ సీరియస్
- October 05, 2017
రెండో పెళ్లిపై రేణు దేశాయ్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్‌గా మారాయి. సెకండ్ మ్యారేజ్ చేసుకోవద్దంటూ పవన్ అభిమానులు పోస్టులు పెట్టడం వివాదాస్పదమైంది. వీటిపై రేణు సీరియస్‌గా స్పందించింది. మగాడు ఎన్నిసార్లైనా పెళ్లి చేసుకోవచ్చు కానీ అమ్మాయి అలాంటి ఆలోచన చేస్తేనే తప్పా అంటూ నిలదీశారు. వివాదం ముదురుతున్నా పవన్ మాత్రం రెస్పాండ్ కాలేదు. హీరో పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రెండో పెళ్లి గురించి చేసిన కామెంట్లపై పవన్ అభిమానులు ఆగ్రహించారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని హేట్ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. కొందరు ఒంటరిగా ఉండాలని సలహాలిస్తే... మరికొందరు రెండో పెళ్లి చేసుకుంటే గౌరవం తగ్గిపోతుందంటూ సాఫ్ట్‌గా హెచ్చరిస్తున్నారు. ఇంకొందరు అభ్యంతరకరమైన మెసేజ్‌లు పెడుతూ మళ్లీ పెళ్లి ఆలోచన విరమించుకోవాలంటున్నారు.
పవన్ అభిమానులు హేట్ కామెంట్లు పెట్టడంపై రేణు దేశాయ్ కూడా సీరియస్‌గానే రెస్పాండ్ అయింది. సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న పరిస్థితులను వివరిస్తూ... మగాళ్ల ఆదిపత్యాన్ని నిలదీస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. దీనిపై కూడా ఇప్పుడు దుమారం రేగుతోంది. మన దేశంలో ఓ మగాడు ఏమైనా చేయొచ్చు... ఎన్నిసార్లైనా పెళ్లి చేసుకోవచ్చు. కానీ అదే ఓ అమ్మాయి మరో పెళ్లి గురించి ఆలోచించడం కూడా తప్పా? అని రేణు దేశాయ్ తన పోస్టులో నిలదీసింది. తప్పు చేశానన్న భావనతో ఏ తోడూ లేకుండా జీవితాంతం బతకాలా అంటూ ప్రశ్నించింది. అంతేకాదు మన దేశంలో అమ్మాయిల భవిష్యత్తు బాగుండాలంటే తల్లులు వాళ్ల కొడుకులను పద్ధతిగా పెంచాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా... ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా అంటూ రేణు దేశాయ్ తన ఆవేదనను బయటపెట్టింది. తల్లులు తమ కొడుకులను పద్ధతిగా పెంచితే అప్పుడైనా మగాళ్ల ఆలోచనా విధానంలో మార్పు వస్తుందేమోనని రేణు దేశాయ్ ఆశాభావం వ్యక్తం చేసింది.
ఇన్నాళ్లు తన మాజీ భర్త పవన్ కల్యాణ్ గురించి మంచిగా చెప్తూ వచ్చిన రేణు దేశాయ్ ఒక్కసారిగా ఇలా ఎందుకు సీరియస్ అయింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విడాకుల తర్వాత పూణెలో ఉంటున్న రేణు దేశాయ్... అక్కడే ప్రొడక్షన్ హౌజ్ ప్రారంభించి సినిమా నిర్మాణం చేస్తోంది. ఇటీవలే స్టార్ మా టీవీలో ప్రారంభమైన ఓ డ్యాన్స్ ప్రోగ్రాంకు జడ్జిగా వ్యవహరిస్తోంది. ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఒంటరిగా ఉండడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందుల
గురించి చెప్పింది. తనను అర్థం చేసుకునే వ్యక్తి దొరికితే మళ్లీ పెళ్లి గురించి ఆలోచిస్తానని ఆమె వెల్లడించింది. అప్పుడే పవన్ అభిమానుల నుంచి వ్యతిరేకత మొదలైంది. ఇంత జరుగుతున్నా... పవన్ కల్యాణ్ మాత్రం రెస్పాండ్ కాలేదు.
పవన్ కల్యాణ్, రేణు దేశాయ్‌లు భద్రి, జానీ సినిమాల్లో కలిసి నటించారు. అప్పుడే వారి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత కొన్నాళ్లు సహజీవనం చేశారు. అప్పుడే వారికి కుమారుడు అఖిర జన్మించారు. అతడికి ఐదేళ్ల వయసు వచ్చాక 2009లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వారికి కూతురు ఆద్య జన్మించాక కొన్నాళ్లకు విడాకులు తీసుకున్నారు. కానీ వాటికి కారణాలేంటనేదానిపై ఇప్పటికే మూడో వ్యక్తికి తెలియదు. విడాకుల తర్వాత కూడా పవన్ అప్పుడప్పుడు పూణె వచ్చి పిల్లలతో గడుపుతాడని రేణు దేశాయ్ ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూ వచ్చారు. కానీ ఎప్పుడూ రెండో పెళ్లి గురించి మాత్రం ప్రస్తావించలేదు. మరి ఇప్పుడు ఈ వివాదం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని రేణు అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









