ట్విట్టర్ లో వరుస ర్యాంకులు డోనాల్డ్ ట్రంప్.. పోప్ ఫ్రాన్సిస్.. నరేంద్ర మోదీ..
- October 05, 2017
ఇప్పుడు అంతా ట్వీట్ ప్రపంచం. ఏది చెప్పాలన్నా ట్విట్టరే. దేశాధితనేతలకు ఇప్పుడు అదే దివ్యాస్త్రం. ట్విట్టర్‌ను వాడుతున్న నేతల్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టాప్ ప్లేస్‌లో ఉన్నారు. ట్రంప్ ఇటీవల పోప్ ఫ్రాన్సిస్‌ను దాటేశారు. ఇక మూడవ స్థానంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారు. ట్విట్ప్లోమసీ అనే సంస్థ.. ట్విట్టర్ ఫాలోవర్స్‌పై ఇటీవల సర్వే చేసింది. అందులో ఏ నేతను ఎవరు ఎలా ఫాలో అవుతున్నారన్న అంశాన్ని పరిశీలించింది. ట్విట్ప్లోమసీ నివేదిక ప్రకారం ట్రంప్‌కు సుమారు 40 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. మొత్తం 890 మంది నేతల అకౌంట్ల ఆధారంగా ఈ లిస్టును తయారు చేశారు. వాటికన్ గురువు పోప్ ఫ్రాన్సిస్ రెండవ స్థానంలో ఉన్నారు. ట్విట్టర్లో పోప్‌కు 39 లక్షలు, మోదీకి 34 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. అయితే అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ట్విట్టర్లో సుమారు 95 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. కానీ ఆయన్ను తాజా సర్వేలోకి తీసుకోలేదు. ట్విట్టర్ ద్వారానే ట్రంప్.. ప్రభుత్వ విధానాలను.. వివాదాస్పద ప్రకటనలను చేస్తున్నారు. దీంతో ఆయనకు ట్విట్టర్లో ఫాలోవర్లు విపరీతంగా పెరిగిపోతున్నారు. ఉత్తర కొరియా నేత కిమ్‌పై ట్విట్టర్ ద్వారా వ్యక్తిగత బెదిరింపులకు దిగిన ట్రంప్ వల్ల ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు కూడా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







